LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyrics
రాజ్యం గెలిసినోడు రాజవుతాడు
రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు
యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు
యుద్ధం ఇడిసెయ్తోడేయ్ దేవుడు

చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
తీపితో పాటుగా ఓ కొత్త చేదు
అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో

కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయ్
తీయగుంటే కడదాకా వదలవు గనక
కష్టలెందుకు బరువుగుంటాయ్
తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించావ్ గనక
ఎదురే లేని నీకు కాక
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడాఖా
వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డ వాడే కష్ట పడ్డ వాడే
పైకి లేచే ఉగ్ర హోరు
ఒక్కడైనా కాన రాడ్డే
జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో

మడతే నలగని షర్ట్ లాగా
అల్మరాహ్ లో పడి ఉంటె అర్ధం లేదు
యీటె తగలని కాగితంల
ఒట్టి చెదలు పట్టి పోతే
ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాటేమి కోతేమ్ కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపొర
నీదైన గెలుపు దారిలోన
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో

WRITERS

DEVI SRI PRASAD, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, Royalty Network, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other