LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyrics
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే
వయసు అను గగనంలో మనసు అను మేఘంలో
చిరు ఆశల వర్షంలో నన్ను గుచ్చి గుచ్చి తడిపావే
నా అనువు అనువు నువ్వేలే
నీ తనువు తనువు నాదేలే
ప్రతి క్షణము క్షణము మనదేలే చెలీ
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే

వెన్నెల వల విసిరి నీ కన్నులు వెలిగిస్త
మెరుపుల మెడ వంచి నీ మెడలో గొలుసేస్తా
చుక్కలు అన్ని చేపలు చేసి నీకే కమ్మని విందిస్త
మబ్బుని దించి సబ్బుగా మార్చి నీకే స్నానం చేయిస్తా
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే

కాలికి రెక్కలు కట్టి నీ కౌగిట వాలిపోత
పూలను అప్పడిగి పూరేకుని చీర చుడత
ఆకాశాన్ని చాపె చుట్టి నీకే పరుపుగా పరిచేస్త
సూర్యున్ని గుద్దుతో చంపి పొద్దె పొడవని ముద్దిస్తా

హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే

WRITERS

SAHITHI, DEVI SRI PRASAD

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist