చింత చెరువులోన కప్పల మందు బెక బెక మన్నది
ఎర్ర చెరువు గట్టు ఎద్దుల మందు పద పద మన్నది
సూరీడు అల్లి సందురుడొచ్చే రాత్రి పూటలో
యెన్నెలా పాటే ఇనిపించింది వేకువ జాముల్లో
కళ్ళపు పేసి పోయి ఎలిగి పువ్వులు తెంపుకుంటాం
ఇరవై రెండు సుక్కలు పెట్టి ముగ్గులు పెట్టుకుంటాం
పండగ పూట పిలిచిన అల్లుడు ఇంటికి వస్తాడు
అత్తగారికి మామగారికి గాబరా పెడతాడు
పండగకొచ్చిన అల్లుడు మంచి ఆకలి మీద ఉన్నాడ
పిల్లనిచ్చిన మామగారు అప్పుకు తిరుగుతున్నాడు
అత్తారింట్లో తిన్న తిండి అరిగిపోయింది
అప్పు చేసిన మామ ఆస్తి కరిగిపోయింది
ఇరుగు పూసిన అన్నెలమ్మ తెల్లగా నవ్వుతున్నది
విచ్చుకున్న మల్లెమొగ్గ ఘుమ ఘుమ మన్నది
అష్టాచెమ్మ ఆడేస్తాము సలుపే లేకుండా
తొక్కుడుబిళ్ల ఆడేస్తాము అలుపే రాకుండా
నిద్దుర లేచిన పాములు రెండు గట్టిగా చుట్టుకున్నాయి
ఒడ్డున ఉన్న చేపలు రెండు ముద్దులు పెట్టుకున్నాయి
కోలాటాలు ఆడేస్తాము పండగ పూటలో
కోరికలన్నీ కోరేస్తాము దేవుడు పాటలో