పరిచయము లేదా నిను కలువలేదా
నువ్వసలు తెలీదా ఏంటో ఈ వింత
అలవాటే కద నువు కంటి పాపకి
తడబాటెందుకు నిను చూడడానికి
పరిచయము లేదా నిను కలువలేదా
నువ్వసలు తెలీదా ఏంటో ఈ వింత
హే నంగ్ నంగ్ నారే నంగ్ నారే
సయ్యామోరే సయ్యా మోరే సయ్యా
హే నంగ్ నంగ్ నారే నంగ్ నారే
సయ్యామోరే సయ్యా మోరే సయ్యా
ఇంత ఉంటుందని మాత్రం అనుకున్నానా
కొత్తగా నిను కనుగొన్నా ఈ రోజున
ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న నేనే
నా అందాలకింక మెరుగుల్ దిద్దినా
ఓ వయ్యారినయ్యా ఓ సింగారినయ్యా
ముస్తాబయ్యి నీకోసమడుగేసినా
నను చూస్తూ నువు పొగడాలనున్నది
అరెరే ఎందుకు అసలింత నాకు అవసరమా
పరిచయము లేదా నిను కలువలేదా
నువ్వసలు తెలీదా ఏంటో ఈ వింత