మనసే పెట్టి వెతికావంటే ప్రతి ప్రశ్నకు బదులే రాదా
సరదాగానువ్ గడిపేస్తుంటే మదిలో భారం తీరిపోదా
సరిగా చూస్తే ఇలలో ఉండే అది ఏదైనా అందమేగా
పగలు రేయి గాల్లో హాయి పకృతి మొత్తం బంధువేగా
ఏ రంగు రంగు రెక్కలున్న సీతకోకచిలక
మోసుకెళ్లవే నన్ను నింగి దాక
ముద్దు ముద్దు మాటలున్న సిన్ని రామ చిలక
ఏ రంగు రంగు రెక్కలున్న సీతకోకచిలక
మోసుకెళ్లవే నన్ను నింగి దాక
ముద్దు ముద్దు మాటలున్న సిన్ని రామ చిలక
పడిపోతే రారే ఎవరూ నీతో ఉంటా మంటూ
పోరాటం చేస్తే రాదా నువ్వే కోరే మెట్టు
నీ ధైర్యంలోనే సైన్యం ఉంది చూడాలే
చూడే లోకానికి వెలుగు ఒక్కడేలే
నింగి నేల వాగు వంక కొండ కోన గోరువంక
తోడుగుంటాయంట నీకు ఒంటరునుకోకే
గట్టిగా నువు కోరుకుంటే విశ్వమంతా ఏకమయ్యి
ఏదీ లేని వాడు కూడా పట్టు పట్టి
గెలిచినట్టు చరితలెన్నో ఉన్నాయటూ ఒక్కసారి చూడే
యేలో యేలో ఎన్నియాలో అంటూ ఆడి పాడుకుంటూ ముందుకు సాగాలే
ఏ రంగు రంగు రెక్కలున్న సీతకోకచిలక
మోసుకెళ్లవే నన్ను నింగి దాక
ముద్దు ముద్దు మాటలున్న సిన్ని రామ చిలక
ఏ రంగు రంగు రెక్కలున్న సీతకోకచిలక
మోసుకెళ్లవే నన్ను నింగి దాక
ముద్దు ముద్దు మాటలున్న సిన్ని రామ చిలక
ఏ రంగు రంగు రెక్కలున్న సీతకోకచిలక
మోసుకెళ్లవే నన్ను నింగి దాక
ముద్దు ముద్దు మాటలున్న సిన్ని రామ చిలక
ఏ రంగు రంగు రెక్కలున్న సీతకోకచిలక
మోసుకెళ్లవే నన్ను నింగి దాక
ముద్దు ముద్దు మాటలున్న సిన్ని రామ చిలక