LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yenno Alalu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
ఎంతో దిగులు ఏవో చిరు అలకలు
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకు
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా
ఆపవే గొడవలు లలనా
ఆయసం కలుగును తగువుల వలనా
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు

వీచే గాలి ఊపిరిగ మారుట
పూసే పువ్వు రాతిరికి వాడుట
మామూలే ఒ ఒ ఓ
నాలో ప్రేమ నీతోనే సాగుట
నా ప్రాణాలు నీ చెంత పోవుట
నిజమేలే ఒ ఒ ఓ
వెలివేసి వెలతానంటే
ఒంటరిగా బ్రతకాలంటే బాధేలే
వెనువెంటే ఉన్నావంటే
వనవాసం వింతే కాదే హాయేలే
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు

గుచ్చే కళ్ల బాణాలు చేసిన
గాయాలన్ని గుండెల్లొ మోసుకు
తిరిగానే ఒ ఒ ఓ
వచ్చీ రాని సాహిత్యముందని
ముని పళ్లల్లొ నలిగేటి పెదవిని
పొగిడానే ఒ ఒ ఓ
నీ కురులే పంపే గాలి
కోపానికి సెలవంటోంది నిజమేనా
నీ చూపుల సైగలు మళ్లీ
పో పొమ్మని తరిమేసాయి అంతేనా
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
ఎంతో దిగులు ఏవో చిరు అలకలు
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకు
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా
ఆపవే గొడవలు లలనా
ఆయసం కలుగును తగువుల వలనా
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు

WRITERS

KARUNAKAR ADIGARLA, MUNNA KASI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None