సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందురుడు
నవ్వలేని సుపుల్లోన ఎదో గుట్టుంది గుట్టుంది
ఓహ్ సూడలేని నవ్వులోన ఎదో బెట్టుంది బెట్టుంది
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవ
గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఏమంటున్నదో
గుప్పుగా రేగిన గుండెను ఝల్లు ఏమంటున్నదో
చెప్పేయవ ఓఒహ్ పిల్ల చెప్పేయవ
నా గుండెల్లో పండగ తెచ్చావే
నా పువ్వుల్లో దారం అయ్యావే
నా కళ్ళల్లో నీరయి నువ్వే జరావే
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవా
సిన్నదని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందురుడు
నవ్వలేని సుపుల్లోన ఎదో గుట్టుంది గుట్టుంది
ఓహ్ సూడలేని నవ్వులోన ఎదో బెట్టుంది బెట్టుంది
హే చిన్ని చిన్ని పాదాల్లో చిట్టి చిట్టి అందెల్లో
చిందే చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో
ఓహ్ నువ్వే నువ్వే నా జంట నీతో స్నేహం చాలంట
ఏడే వద్దు అరే అడుగులు నడవాలన్నాయే
చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో
కలకలం కాకుండా క్షణకాలం చెలిమయి చేయి కలిపిస్తే ఛాలందే
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవ
ఒహ్హ్ ముద్దు ముద్దు అందంలో ముద్దు గుమ్మా రూపంలో
ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నదో
ఒహ్హ్ ముక్కెర పైన మేరుపల్లె ముక్కెర చుట్టూ సిగ్గాల్లే
ముక్కెర కింద ఊపిరి నువ్వయి ఉంటె ఛాలందే
గల గల ల లొలకే గుస గుసగ చెవిలో ఏమంటుందో
నీ బదులే వింటూ ఇక ఏ మాట విననందే
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవ చెప్పేయవ
సిన్నదని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందురుడు
నవ్వలేని సుపుల్లోన ఎదో గుట్టుంది గుట్టుంది
ఓహ్ సూడలేని నవ్వులోన ఎదో బెట్టుంది బెట్టుంది