నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా
ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుంది
ఇది నీడే అయితే నిశిలో కలిసిపోతుంది
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
నీ వంతు గాలిని నా ఎద నిండా
ఏనాటికి మానదు మానదు నా గాయం
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
ఆ మేలి ముసుగును తొలగించేస్తే
చూడలేదని చూస్తున్న ఒక నటన
చూడలేదని చేస్తున్న ఒక నటన
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా
ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుంది
ఇది నీడే అయితే నిశిలో కలిసిపోతుంది