LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyrics
అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చుస్తే
తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోనా నిన్ను మించే
సిరిలేదే నగ్న సత్యం
నాలో ఎదో సవ్వడి
ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది
అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

నిషా కళ్ళతోటి
వలే వేయకమ్మ
అరే చిక్కుకోదా
ఎదే చేపలా

వయ్యారాల వైపు
అలా చూడకయ్యా
సిరే కందిపోదా
మరీ ఎర్రగా

నువ్వే కాని పువ్వు అయితే
నేను తుమ్మెద అవుత

నువ్వే కాలి మువ్వా అయితే
నేను రాగం అవుత
నిన్నే దాచుకుంటాలే
ప్రియా గుండె కోవెల్లోన

బాపు గీసిన బొమ్మకి
చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన
పాటవు నీవు సఖి

అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

ప్రియా నిన్ను చూసి
మదే మారిపోయే
అదేం మాయో గాని
వాన విల్లుగా

చెలి నిన్ను చేరి
ఎడారైన గాని
వసంతాలు జల్లే
పూల వెల్లువా

నువ్వే నిద్దరోతే నేను
జోల పాటనవుతా
నువ్వే దగ్గరైతే హాయి
లోన తేలిపోతా
చెలి నువ్వు అవునంటే
సరాగాల సంబరమవుతా

నువ్వు నేను ఏకమై
ఇపుడే మనమౌదాం
నింగీ నేలా సాక్షిగా
ఎపుడు ఒకటౌదాం

అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

కలలోనా నిన్ను చూసి
మనసారా కోరుకున్న
ఇలలోనా ఇంతలోన
ఎదురైతే చేరుకున్నా

నాలో ఎదో సవ్వడి
ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది

WRITERS

Kula Sekhar, S.a.raj Kumar

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other