LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ninnala Lede

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈరోజిలా ఎందుకె
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈవెళిలా ఎందుకె
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈరోజిలా ఎందుకె

నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్లా కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి
ఇది ప్రేమ అనుకుంటూ అడుగేసాన నేనేనా
నిను నేనే ఏవేవో అడిగేసాన నిజమేనా
నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని అ అడిగినవన్నీ నిజమే కదా
కదిలేనా నీ పలుకు లేకుండానే క్షణమైనా
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈరోజిలా ఎందుకె

కను తెరిచి ఏవేవో చూస్తూ ఉన్న కనబడదే (కనబడదే)
కనులెదుట నీ రూపే కదులుతూ ఉంది కల కాదే (కల కాదే)
నీ లోకమై నేనుండగా నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా నా ఈ ప్రాణం నీదేకదా
కడదాకా ఒకటై నిలవాలి ఏమైనా
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈరోజిలా ఎందుకె
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈవెళిలా ఎందుకె
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్లా కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి

WRITERS

ANANDRAJ, BIGI BAL, THADA RAJA

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other