LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mounanga Unna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మౌనంగా ఉన్నా నీతో అంటున్నా నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా కదపొద్దంటున్నా లేలెమ్మనీ
వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా
వెతకాల ఏమైనా నిను నాలోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా నిను వీడదే నా ఆలోచనా

నాలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ
నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా వినలేదా నువ్వు నా ఆలాపన

ఎవరూ మన జాడని చూడని చోటే కనిపెడదామా
ఎపుడూ మనమిద్దరి ఒక్కరిలాగే కనబడుదామా
నా పెదవిలో నవ్వులా చేరిపో
నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు మన ఇద్దరికి ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా నిను వీడదే నా ఆలోచన

WRITERS

Sirivennela

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other