LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyric cover art

Kani Penchina Ma Ammake

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కనిపెంచిన మా అమ్మకే అమ్మ అయ్యాను గా
నడిపించిన మా నాన్నాకే నాన్న అయ్యాను గా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కలిపిన కథ ఇధి.
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా

ఆ ఆ ఈ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా
పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్ళతో నే చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా

కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడుచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలి ని మర్చిపొలేను గా
మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలం కద
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా

WRITERS

ANUP RUBENS, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other